: జ్యోతిష్యాన్ని నమ్ముకుంటే జగన్ సీఎం కాలేరు: మంత్రి పల్లె


వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మొసలి కన్నీరు కారుస్తున్నారని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి విమర్శించారు. ఎన్ని ఉద్యమాలు, ఆందోళనలు చేసినా ఆయనేం సాధించలేరని ఎద్దేవా చేశారు. జ్యోతిష్యాన్ని నమ్ముకుని జగన్ సీఎం కాలేరని వ్యాఖ్యానించారు. కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలో ఈ రోజు నిర్వహించిన రైతుకోసం చంద్రన్న యాత్రలో డిప్యూటీ సీఎం కేఈ, పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ప్రత్తిపాటి మాట్లాడుతూ, జగన్ కు దమ్ముంటే రుణమాఫీపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేవారు. వైసీపీకి చెందిన వారికి కూడా రుణమాఫీ చేశామని చెప్పారు.

  • Loading...

More Telugu News