: మరో టైటిల్ సాధిస్తానని కచ్చితంగా చెప్పలేను: నాదల్


మరో టైటిల్ సాధిస్తానని కచ్చితంగా చెప్పలేనని టెన్నిస్ మాజీ చాంపియన్ రఫెల్ నాదాల్ తెలిపాడు. క్లే కోర్టుల రారాజుగా నీరాజనాలు అందుకున్న నాదల్ తన కెరీర్ పై ఆందోళన వ్యక్తం చేశాడు. గాయాల బారిన పడి ఫాం కోల్పోయిన నాదల్ తిరిగి పుంజుకోలేకపోతున్నాడు. వివిధ టోర్నీలలో ఆడుతున్నా సెమీస్ చేరుకునేందుకు నానాతంటాలు పడుతున్నాడు. తనకు తిరుగులేదని చాటిన క్లేకోర్టుల్లో కూడా నాదల్ కు చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. దీంతో తన క్రీడా భవిష్యత్ పై అనుమానం వ్యక్తం చేశాడు. భవిష్యత్ లో గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధిస్తానని చెప్పలేనని పేర్కొంటున్నాడు. అయితే ప్రాక్టీస్ అయినా, టోర్నీ అయినా టెన్నిస్ ఆడడాన్ని ఆస్వాదిస్తానని నాదల్ చెప్పాడు. గతంలో ఏదో సాధించాలన్న తపన ఉండేదని, ఇప్పుడది లోపించిందని నాదల్ వెల్లడించాడు. తాను ఆండీ ముర్రేను బాగా ఇష్టపడతానని, అతను సహజంగా ఉంటాడని నాదల్ పేర్కొన్నాడు. ముర్రేకు ప్రాధాన్యత ఇస్తానని నాదల్ తెలిపాడు.

  • Loading...

More Telugu News