: ఖైరతాబాద్ లో కేసీఆర్ మనవడు, మీడియాతోనూ మాట్లాడాడు... ఏమన్నాడో మీరూ చూడండి!


ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్రకు ముందు గణేశుని దర్శించుకునేందుకు ఓ బుల్లి వీఐపీ వచ్చాడు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, ఐటీ మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు ఖైరతాబాద్ కు వచ్చి గణపతి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేశాడు. హిమాన్షు ఎవరో తెలియని భక్తులు, ఓ బాలుడికి ఇంత సెక్యూరిటీ ఏంటని ఆరాతీయడం కనిపించింది. తరువాత విషయం తెలుసుకుని హిమాన్షును చూసేందుకు ఆసక్తి చూపారు. గణపతి వద్ద పూజల అనంతరం మీడియా కోరికతో రెండు నిమిషాలు మాట్లాడిన హిమాన్షు "నిమజ్జనం వేడుకల్లో నేను తొలిసారిగా పాల్గొంటున్నా. ఎంతో ఆనందంగా ఉంది. ప్రతిఒక్కరూ ఆనందంగా ఉండాలని గణపతిని వేడుకున్నా" అని చెప్పాడు. హిమాన్షు ఇంకా ఏం మాట్లాడాడో మీరూ వీడియోలో చూడొచ్చు.

  • Loading...

More Telugu News