: లండన్ లో కుటుంబ సభ్యులతో రణబీర్ బర్త్ డే


బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ తన 33వ పుట్టినరోజును ఈసారి కుటుంబసభ్యులతో జరుపుకున్నాడు. ప్రస్తుతం రణబీర్ లండన్ లో ఉండటంతో తల్లి, అలనాటి నటి నీతూ కపూర్, తండ్రి రిషికపూర్ లు అక్కడికే వెళ్లి కుమారుడి పుట్టినరోజును ప్రత్యేకంగా నిర్వహించారు. కొడుకు స్నేహితులకు పార్టీ కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా క్లిక్ మనిపించిన ఫోటోలను ట్విట్టర్ లో పోస్టు చేసి అభిమానులతో పంచుకున్నారు. అదే సమయంలో రణబీర్ చిన్నప్పటి పుట్టినరోజు ఫోటోను కూడా నీతూ ట్విట్టర్ లో పెట్టారు. ప్రస్తుతం రణబీర్ నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్న 'యే దిల్ హై ముష్కిల్' చిత్రం షూటింగ్ కోసం అక్కడున్నాడు.

  • Loading...

More Telugu News