: 30,000 అడుగుల ఎత్తులో విమానం తలుపు తెరవబోయాడు


ఎడిన్ బరో నుంచి ఆమ్ స్టర్ డామ్ వెళ్తున్న కేఎల్ఎం విమాన సిబ్బంది అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. ఈ విమానంలో ప్రయాణిస్తున్న జేమ్స్ గ్రే అనే వ్యక్తి 30,000 అడుగుల ఎత్తులో విమానం ఎగురుతుండగా, తలుపు తెరవబోయాడు. అతని ప్రయత్నాన్ని గమనించిన సిబ్బంది అతనిని అడ్డుకున్నారు. వెంటనే అతనిని అదుపులోకి తీసుకుని విచారించగా, అర్జెంటుగా టాయ్ లెట్ కు వెళ్లాల్సి ఉండడంతో, టాయ్ లెట్ డోర్ అనుకుని తెరవడానికి ప్రయత్నించానని, అది మెయిన్ డోర్ అనుకోలేదని తెలిపాడు. ఒక రోజంతా అతనిని అదుపులోకి ఉంచుకుని విచారించిన అధికారులు, 44,000 రూపాయలు జరిమానా విధించి, ఐదేళ్ల పాటు కేఎల్ఎం విమానం ఎక్క కూడదని ఆదేశించారు.

  • Loading...

More Telugu News