: బొగ్గు స్కాంలో మన్మోహన్ సింగ్ కు సీబీఐ క్లీన్ చిట్


బొగ్గు కుంభకోణంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు ఊరట లభించింది. జిందాల్ గ్రూప్ కు బొగ్గు గనుల కేటాయింపు కేసులో సీబీఐ ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ కేసులో గతంలో మన్మోహన్ విచారించేందుకు సీబీఐ సమన్లు ఇవ్వగా వెంటనే ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు. దాంతో కోర్టు స్టే ఇచ్చింది. మరోవైపు ఈ కేసులో నిందితులుగా ఉన్న మాజీ సీఎం మధుకోడా, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావులు మన్మోహన్ పై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఆయనకు సీబీఐ క్లీన్ చిట్ ఇవ్వడం గమనార్హం.

  • Loading...

More Telugu News