: ఏపీ సీఎం నివాసానికి దగ్గరలోని లంకల్లో అగ్నిప్రమాదం... వ్యాపించిన పొగలు


గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం వద్ద కృష్ణానది లంకల్లో ఈ మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. ఇక్కడి సమీపంలోనే ఏపీ సీఎం నివాసం లింగమనేని ఎస్టేట్ ఉంది. దాంతో ఆ ప్రాంతం వరకూ పొగలు వ్యాపించాయి. లంకభూముల్లో ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఆ భూముల్లోకి అగ్నిమాపక వాహనం వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో మంటలార్పేందుకు అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. మరోవైపు సీఎం నివాసం వైపు వెళ్లే రహదారి మార్గం నిర్మాణంలో ఉండటంతో తాత్కాలికంగా మూసేశారు.

  • Loading...

More Telugu News