: ఇంటర్నేషనల్ రూట్లలో సగం ధరకే టైగర్ ఎయిర్ విమాన టికెట్లు


సింగపూర్ కేంద్రంగా పనిచేస్తూ, ఇండియాలోని పలు ప్రాంతాల నుంచి విదేశాలకు విమాన సర్వీసులు నడుపుతున్న టైగర్ ఎయిర్ తాజాగా, బంపర్ ఆఫర్ ప్రకటించింది. భారత పాసింజర్లకు సగం ధరకే విదేశీ ప్రయాణానికి టికెట్లను అందిస్తామని వెల్లడించింది. అక్టోబర్ 8 వరకూ టికెట్లను సంస్థ అధికారిక వెబ్ సైట్ ద్వారా బుక్ చేసుకుని, నవంబర్ 1 నుంచి వచ్చే సంవత్సరం మార్చి 23 మధ్య ప్రయాణ తేదీని నిర్ణయించుకున్న వారికి ఆఫర్ వర్తిస్తుందని సంస్థ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ తెహ్ యిక్ చువాన్ వెల్లడించారు. ప్రస్తుతం బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కొచ్చి, తిరుచిరాపల్లి, లక్నో నగరాల నుంచి తమ సర్వీసులు తిరుగుతున్నాయని, ఈ ప్రాంతాల నుంచి బాలీ, బ్యాంకాక్, హాంకాంగ్, జకార్తా, కౌలాలంపూర్, మనీలా, పెర్త్, తైపే, సింగపూర్ తదితర ప్రాంతాలకు వారానికి 41 సర్వీసులు తిరుగుతున్నాయని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News