: ఎర్రబెల్లి అరెస్టును బీజేపీ ఖండిస్తోంది: లక్ష్మణ్
వరంగల్ జిల్లా పాలకుర్తిలో జరిగిన టీడీపీ, టీఆర్ఎస్ నేతల ఘర్షణ నేపథ్యంలో టి.టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావును అరెస్టు చేయడంపై తెలంగాణ బీజేపీ నేత లక్ష్మణ్ స్పందించారు. ఆయన అరెస్టును ఖండిస్తున్నట్టు చెప్పారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అధికార పక్షం ప్రొటోకాల్ పాటించకుండా వ్యవహరిస్తోందని ఆరోపించారు. విపక్షాల గొంతు నొక్కేందుకు యత్నించడం సరికాదని మండిపడ్డారు. తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయడం మానుకోవాలని లక్ష్మణ్ సూచించారు.