: ‘బ్రూస్ లీ’ షూటింగ్ లో మెగాస్టార్...చాలాకాలం తర్వాత కెమెరా ముందుకు వచ్చిన చిరంజీవి


కాంగ్రెస్ పార్టీ నేత, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి మరోమారు ఆర్టిస్టు అవతారం ఎత్తారు. తన కొడుకు, టాలీవుడ్ యంగ్ హీరో రాంచరణ్ తేజ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘బ్రూస్ లీ’ చిత్రం షూటింగ్ లో చిరంజీవి పాల్గొన్నారు. 2008లో రాజకీయ రంగ ప్రవేశం తర్వాత చిరంజీవి సినిమాల వైపు రాలేదు. అడపాదడపా పలు చిత్రాల ఆడియో ఫంక్షన్లు హాజరైన చిరంజీవి కెమెరా ముందుకు మాత్రం రాలేదు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన ఆయన యూపీఏ-2 సర్కారులో పర్యాటక శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అయితే మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం తర్వాత చిరంజీవి మళ్లీ ముఖానికి రంగేసుకునేందుకు సిద్ధపడ్డారు. ఈ క్రమంలో తన 150 చిత్రం ద్వారానే ఆయన తెరపై కనిపిస్తారని అంతా భావించారు. అయితే తన కొడుకు చిత్రంలో ఓ చిన్న పాత్ర పోషిస్తున్న చిరంజీవి నేటి ఉదయం కెమెరా ముందుకు వచ్చారు.

  • Loading...

More Telugu News