: స్పీడ్ బోట్ పేలిన ప్రమాదం నుంచి తప్పించుకున్న మాల్దీవుల అధ్యక్షుడు
మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ గయూమ్ స్పీడ్ బోట్ పేలిన ప్రమాదం నుంచి సురక్షితంగా తప్పించుకున్నారని ఆ దేశ మంత్రి మహ్మద్ షరీఫ్ తెలిపారు. ఈ ఘటనలో ఆయన భార్య ఫాతిమా ఇబ్రహీం, వ్యక్తిగత రక్షకుడు, పలువురు అధికారులకు స్వల్ప గాయాలయ్యాయని, వెంటనే వారిని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించినట్టు వెల్లడించారు. సౌదీ అరేబియాలోని హజ్ తీర్థయాత్ర ముగించుకుని ఈ ఉదయం స్థానిక ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి మాలెకి స్పీడ్ బోట్ లో తిరిగి వస్తుండగా బోట్ లో ఒక్కసారిగా పేలుడు చోటుచేసుకుంది. అయితే బోట్ లో సాంకేతిక లోపం తలెత్తడంతోనే ఘటన జరిగిందని అధికారులు భావిస్తున్నారు.