: 'మెక్ డోవెల్స్ డైట్' విస్కీని నిషేధించాలంటూ హైకోర్టులో పిల్
తెలుగు రాష్ట్రాల్లోని మద్యం అమ్మకాల్లో అగ్రభాగాన నిలిచే బ్రాండ్లలో 'మెక్ డోవెల్స్ డైట్' విస్కీ ఒకటి. అలాంటి మెక్ డోవెల్స్ డైట్ విస్కీపై హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ మద్యపానాన్ని వెంటనే నిషేధించాలంటూ కర్నూలు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి పిల్ దాఖలు చేశారు. ఈ మద్యం క్వాలిటీ బాగుండటం లేదని... దీన్ని తాగిన వారు అనారోగ్యానికి గురవుతున్నారని పిల్ లో పేర్కొన్నారు. వైద్యుల నుంచి నివేదికలు అందినప్పటికీ ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ మద్యాన్ని నిషేధించేలా ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టును కోరారు.