: సోమ్ నాథ్ భారతికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ... ముందు లొంగిపోవాలని ఆదేశం
ఆమ్ ఆద్మీ పార్టీ నేత సోమ్ నాథ్ భారతికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ముందు ఈ రోజు పోలీసులకు లొంగిపోవాలని, ఆ తరువాత కోర్టుకు రావాలని ఆయనను ఆదేశించింది. అంతేగాక తనను అరెస్టు నుంచి రక్షించాలంటూ సోమ్ నాథ్ దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. మీరు బాధ్యతగల పౌరుడైతే పారిపోవాల్సిన అవసరమేముందుని భారతికి కోర్టు హితవు పలికింది. భార్య లిపికా మిత్రా పెట్టిన గృహహింస, హత్యాయత్నం కేసులో పోలీసులకు లొంగిపోకుండా బెయిల్ కోసం సోమ్ నాథ్ కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన పరారీలో ఉన్నారు.