: ఏపీలో రాష్ట్ర రహదారులను హైవేలుగా మార్చేందుకు కేంద్రం అంగీకారం


ఆంధ్రప్రదేశ్ లో 800 కిలో మీటర్ల రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. సుమారు రూ.వెయ్యి కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టుకు అనుమతించింది. ఈ మేరకు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సందేశం వచ్చింది. రాష్ట్రంలోని కర్నూలు మీదుగా అనంతపురం-అమరావతిని కలుపుతూ ఎన్ హెచ్ 44, ఎన్ హెచ్ 65లను, కర్నూలు, కడప, అనంతపురంలో ఎన్ హెచ్ 40, ఎన్ హెచ్ 65 లను అనుసంధానించనున్నట్టు తెలిపింది.. వీటిని 4 వరుసల రహదారి నుంచి 6, 8 వరుసల రహదారులుగా మార్చనున్నారు. రాజధాని అమరావతి చుట్టూ 185 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డుకు కూడా కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. వాటికి రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియ పూర్తి చేస్తే పనులు ప్రారంభిస్తామని కేంద్రం తెలిపింది.

  • Loading...

More Telugu News