: ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోంది: వెంకయ్య


ప్రపంచ దేశాలన్నింటికీ భారత్ ఓ ఆశాదీపంలా కనిపిస్తోందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచం మొత్తం భారత్ వైపే చూస్తోందని చెప్పారు. ఇటీవల కాలంలో మన దేశంలో అమెరికా పెట్టుబడులు సైతం భారీగా పెరిగాయని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని... దేశాన్ని మరింత శక్తిమంతం చేసేందుకు అందరి సహకారం అవసరమని చెప్పారు. అత్యంత కీలకమైన బిల్లులు పార్లమెంటులో పెండింగ్ లో ఉన్నాయని... వాటి ఆమోదం కోసం విపక్షాలన్నీ సహకరించాలని కోరారు. దేశ నిర్మాణంలో విపక్షాలు నిర్మాణాత్మకమైన పాత్రను పోషించాలని విన్నవించారు.

  • Loading...

More Telugu News