: కోర్టులు చేతులెత్తేసిన వేళ... రాష్ట్రపతి టూ హోం శాఖకు తలసాని వ్యవహారం


తెలుగుదేశం పార్టీ గుర్తుపై గెలిచి, రాజీనామా చేయకుండా టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయి పదవులు అనుభవిస్తున్న నేతల వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఈ విషయం శాసనసభ స్పీకర్ పరిధిలో ఉందని, ఆయనకు తాము ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు కూడా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి తెలుగుదేశం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ లేఖ రాయడంతో, ఈ తేనెతుట్టె మరోసారి కదిలింది. టీడీపీ తరఫున గెలిచి టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతుండటాన్ని, కోర్టులు కల్పించుకోలేకపోతున్న విషయాన్ని ఆయన లేఖలో ప్రస్తావించారు. తలసాని రాజీనామా చేయలేదన్న సంగతిని తెలిపారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి సైతం సీరియస్ గా తీసుకున్నారు. వెంటనే దీని విషయం చూడాలంటూ, మాగంటి రాసిన లేఖను రాష్ట్రపతి కార్యాలయం హోం మంత్రిత్వ శాఖకు పంపింది. దీనిపై నిర్ణయం తీసుకోవాలని కోరింది. హోం శాఖ స్పందించయినా, జరుగుతున్న వివాదానికి తెర వేస్తుందేమో చూడాలి!

  • Loading...

More Telugu News