: జమ్మూ కాశ్మీర్ లో ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణ
జమ్మూ కాశ్మీర్ లో మొబైల్ ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించారు. ఇంటర్నెట్ సేవలపై విధించిన నిషేధాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉదయం 10 గంటలకు ఎత్తివేసింది. బక్రీద్ పండుగ, ఎద్దు మాంసంపై నిషేధం కొనసాగుతున్న నేపథ్యంలో అసాంఘిక శక్తులు మతవిద్వేషాలు రెచ్చగొట్టే అవకాశముందన్న సమాచారంతో మూడు రోజుల పాటు ఇంటర్నెట్ సేవలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు నుంచి నెట్ సేవలు అందుబాటులోకి రావడంతో విద్యార్థులు, వ్యాపారులు ఊపిరి పీల్చుకున్నారు.