: మీరు చెల్లించాల్సిన కరెంటు బిల్లు రూ. 85 కోట్లు మాత్రమే... హర్యానా విద్యుత్ బోర్డు లీల!
నెలకు సాధారణంగా రూ. 2,200 నుంచి రూ. 2,500 వరకూ కరెంటు బిల్లు చెల్లించే ఆ ఆసామి ఒక్కసారిగా షాక్ తిన్నాడు. నెల రోజుల కరెంటు వాడకానికి ఆయనకు రూ. 85 కోట్లు బిల్లు రావడమే ఇందుకు కారణం. ఈ ఘటన హర్యానాలో జరిగింది. హెచ్ఎస్ వర్మ అనే వ్యక్తికి రాష్ట్ర ఎలక్ట్రిసిటీ విభాగం అధికారులు పంపిన బిల్లు ఇది. "మీరు చెల్లించాల్సిన కరెంటు బిల్లు 85 కోట్ల రూపాయలు మాత్రమే" అంటూ వచ్చిన బిల్లు చూసి ఆయన అవాక్కయ్యాడు. ఈ బిల్లుతో తాము కష్టాల్లో పడ్డామని, దీన్ని సరిచేయాలని అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోందని వర్మ వాపోయారు.