: 2న ఏపీ రాష్ట్రవ్యాప్త దీక్ష చేపడుతున్న సీపీఐ


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ 2న సీపీఐ దీక్ష చేపడుతోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజ్, విభజన బిల్లులోని అంశాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దీక్షకు సిద్ధమైంది. ఈ వివరాలను సీపీఐ ఏపీ కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని కోరుతూ 5వ తేదీన ధర్నా నిర్వహించనున్నామని చెప్పారు. అమరావతి ప్రాంతంలోని భూములను సింగపూర్ కు కట్టబెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వామపక్షాలపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అర్థరహితమైన విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News