: తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటి బంధం నాకెందుకు?: కంగనా రౌనత్


జీవితం పట్ల ఎవరైతే అసంతృప్తితో ఉంటారో అటువంటి వాళ్లే లివ్-ఇన్ రిలేషన్ షిప్ గురించి ఆలోచిస్తారని, అభద్రతాభావం అధికంగా ఉన్నవారే ఇతరుల తోడు గురించి వెతుకుతూ, సహజీవనం చేస్తుంటారని చెబుతోంది బాలీవుడ్ బ్యూటీ కంగనా రౌనత్. తనకు ఎటువంటి అభద్రత, అసంతృప్తి లేవని, అందువల్ల తన జీవితంలో సహజీవనం అన్న మాటే లేదని స్పష్టం చేసింది. సహజీవనంలో బయటకు వెళ్లేందుకు ఎప్పుడూ తలుపులు తెరచే వుంటాయని, ఈ తరహా తుమ్మితే ఊడిపోయే ముక్కు వంటి బంధం తనకెందుకని ప్రశ్నిస్తోంది. తన మనసుకు నచ్చిన అబ్బాయి దొరికితే వివాహం చేసుకుంటానని వెల్లడించింది. కాగా, బాలీవుడ్ లో బిపాసాబసు, జాన్ అబ్రహాం జంట తాము సహజీవనం చేస్తున్నామని బహిరంగంగానే చెప్పుకోగా, ప్రస్తుతం కత్రినా, రణబీర్ జంట ఇదే పనిలో ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News