: విశాఖకు మరో ముప్పు పొంచి ఉందా?... నిజమేనంటున్న ఇన్ కాయిస్


సుందర నగరం విశాఖను మొన్నటి హుదూద్ తుపాను దాదాపుగా నేలమట్టం చేసింది. అయితే ఏపీ ప్రభుత్వ చిత్తశుద్ధి, ప్రజల తోడ్పాటుతో ఆ నగరం త్వరగానే కోలుకుంది. కుప్పకూలిన భవనాల స్థానంలో కొత్త భవనాలు వెలుస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ హుదూద్ ఆనవాళ్లు దాదాపుగా తుడిచిపెట్టుకుపోయాయి. అయితే నవ్యాంధ్ర బిజినెస్ కేపిటల్ గా ఎదుగుతున్న ఆ నగరానికి మరో ముప్పు పొంచి ఉందని చెబుతోంది సర్కారీ వాతావరణ సంస్థ ‘ఇన్ కాయిస్’. భూమికి అతి చేరువగా చంద్రుడు వస్తున్నాడు. సూపర్ మూన్ గా పిలుస్తున్న ఈ ఉపద్రవం బంగాళాఖాతంలోనే కాక భూమండలంలోని సముద్రాలపై పెను ప్రభావాన్నే సృష్టించనుందట. సూపర్ మూన్ ప్రభావం కారణంగా సముద్రంలో అలలు ఐదు అడుగుల మేర ఎగసిపడతాయని ఇన్ కాయిస్ చెబుతోంది. దీంతో సముద్రంలో అల్లకల్లోలం తప్పనిసరి అని హెచ్చరిస్తోంది. ఈ అలల కారణంగా తీర ప్రాంతాలకు ముప్పు ఉందని చెప్పిన ఆ సంస్థ... విశాఖతో పాటు అండమాన్, కేరళలకూ ప్రమాదం పొంచి ఉందని చెబుతోంది. వచ్చే నెల 2 వరకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News