: అభివాదం ఆంగ్లంలో... ప్రసంగం హిందీలో!: శాప్ సెంటర్ లో మోదీ వైవిధ్యం
మోదీ ప్రసంగం అంటేనే వైవిధ్యానికి కేరాఫ్ అడ్రెస్. తన సమ్మోహన శక్తితోనే ఆయన గడచిన సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించారు. ఆ తర్వాత భారత ప్రధాని హోదాలో విదేశీ పర్యటనల్లో ఆయా దేశాల్లోని ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ, వారిని పరవశింపజేశారు. తనదైన మాట తీరుతో ఆకట్టుకుంటున్నారు. అగ్రరాజ్యం అమెరికా సహా విదేశాల్లో భారత నినాదాలు మిన్నంటేలా చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం అమెరికా నగరం కాలిఫోర్నియాలోని శాప్ సెంటర్ లో మోదీ తనదైన రీతిలో అక్కడి ప్రవాస భారతీయులను కేరింతలు కొట్టించారు. ‘గుడ్ మార్నింగ్ కాలిఫొర్నియా’ అంటూ ఆంగ్లంలో అక్కడి వారికి అభివాదం తెలిపిన మోదీ, ఆ తర్వాత తన ప్రసంగాన్ని పూర్తిగా హిందీలో కొనసాగించారు.