: ‘బూట్ క్యాంప్’కు ధోనీ సేన... నేడు ధర్మశాలలో కఠోర శిక్షణ ప్రారంభం


దక్షిణాఫ్రికాతో 72 రోజుల పాటు సుదీర్ఘ సిరీస్. ప్రపంచ క్రికెట్ లోనే అత్యంత పటిష్ఠమైన జట్టుగా పేరుగాంచిన సఫారీలతో ఆట అంటే కాస్తంత కష్టమే. అందుకే టీమిండియా జట్టు సభ్యులు శారీరకంగానే కాక మానసికంగానూ బలపడాల్సి ఉంది. బీసీసీఐ మేనేజ్ మెంట్ కూడా ఇదే అభిప్రాయంతో ఉంది. ఆటగాళ్ల శారీరక, మానసిక బలం కోసం ‘బూట్ క్యాంప్’ను నిర్వహిస్తోంది. ఈ క్యాంప్ లో పాల్గొనేందుకు నేడు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని టీమిండియా ధర్మశాలలో కాలుమోపనుంది. సముద్ర మట్టానికి దాదాపు 7 వేల అడుగుల ఎత్తులో జట్టు సభ్యులకు ‘హై ఆల్టిట్యూడ్’ వాతావరణంలో సైనిక తరహా శిక్షణ ఉంటుంది. రెండు రోజుల పాటు సాగనున్న ఈ శిక్షణ శిబిరంలో ధోనీ సేన ట్రెక్కింగ్, దూకడం, పాకడం తదితర వ్యాయామాలు చేయనున్నారు. టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రి సూచనల మేరకే ఈ తరహా కఠోర శిక్షణకు ప్లాన్ చేసినట్లు హిమాచల్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ పీసీఏ) ప్రెస్ కార్యదర్శి మోహిత్ సూద్ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News