: టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫేస్ బుక్ లో అసభ్యకర వ్యాఖ్యలు... విచారిస్తున్న పోలీసులు
తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే ఫేస్ బుక్ అకౌంట్లో అసభ్యకర వ్యాఖ్యలు నిన్న కలకలం రేపాయి. గుర్తు తెలియని వ్యక్తులు పోస్ట్ చేసిన ఆ అసభ్యకర పోస్టులపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. వివరాల్లోకెళితే... మెదక్ జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఫేస్ బుక్ అకౌంట్లో నిన్న కొన్ని అసభ్యకర పోస్టింగ్ లు దర్శనమిచ్చాయి. వాటిని గమనించిన ఎమ్మెల్యే వెంటనే తన అనుచరులను అప్రమత్తం చేశారు. వెనువెంటనే దుబ్బాక పోలీసులను ఆశ్రయించిన ఆయన అనుచరులు దీనిపై ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు వ్యాఖ్యలను పోస్ట్ చేసిన వ్యక్తుల కోసం గాలింపు ప్రారంభించారు.