: క్రికెట్ అభిమానులకు పండుగే!...వచ్చే నెల 2 నుంచి భారత్, దక్షిణాఫ్రికాల మధ్య ఫ్రీడమ్ సిరీస్


నిజంగా క్రికెట్ అభిమానులకు పండుగ సమీపించింది. దాదాపు 72 రోజుల పాటు కొనసాగనున్న ‘ఫ్రీడమ్ సిరీస్’ వచ్చే నెల 2న ప్రారంభం కానుంది. టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగనున్న ఈ సిరీస్ లో మూడు టీ20లు, ఐదు వన్డేలు, నాలుగు టెస్టు మ్యాచ్ లు జరగనున్నాయి. ఇందులో భాగంగా తొలి టీ20 వచ్చే నెల ధర్మశాలలో జరగనుంది. నిన్న మధ్యాహ్నానికే సఫారీలు భారత్ చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండైన సఫారీ ఆటగాళ్లు మీడియాతో మాట్లాడకుండానే తమకు కేటాయించిన హోటల్ కు వెళ్లిపోయారు. సుదీర్ఘ సిరీస్ కు సన్నాహకంగా రేపు ఇండియా ప్రెసిడెంట్స్ ఎలెవెన్ తో సఫారీలు టీ20 ఫ్రాక్టీస్ మ్యాచ్ ఆడనున్నారు.

  • Loading...

More Telugu News