: వెంకయ్య నాయుడుకి దమ్ముంటే ఏపీ నుంచి ఎంపీగా పోటీ చేయాలి: సీపీఐ నేత రామకృష్ణ


కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుకి దమ్ముంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 25 లోక్ సభ స్థానాల్లో ఎక్కడి నుంచైనా సరే పోటీ చేసి గెలవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ సవాల్ విసిరారు. విజయవాడలో రెండు రోజుల పాటు జరగనున్న సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాలను ఈరోజు ప్రారంభించిన ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీకి రాష్ట్రంలో బలముందని చెప్పుకుంటున్న వెంకయ్య నాయుడు ఎంపీగా గెలిచి చూపించాలన్నారు. ప్రత్యేకహోదా అంశంలో ఏపీ ప్రజలను పక్కాగా మోసం చేశారంటూ ఆయన మండిపడ్డారు.

  • Loading...

More Telugu News