: సంతకం చేయడానికి చాలా సందేహించా: ప్రియాంక చోప్రా


తాను నటిస్తున్న అమెరికన్ టీవీ సీరీస్ ‘క్వాంటీకో’లో నటించేందుకు ముందు చాలా సందేహించానని, అందుకే అంత తొందరగా సంతకం చేయలేదని చెప్పింది బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా. ఈ విషయం గురించి ఆమె ఒక ఇంటర్వ్యూలో చెబుతూ, "టీవీ సీరీస్ షూటింగ్ కు చాలా ఎక్కువ సమయం పడుతుంది. ఇప్పటికే రెండు సినిమాలకు ఒప్పుకున్నాను. దీంతో క్వాంటికోలో నటించేందుకు కొంచెం ఆలోచించాను. కానీ, క్వాంటికో స్క్రిప్ట్ నచ్చడంతో కాదనలేకపోయాను" అని ప్రియాంక చోప్రా చెప్పింది. అక్టోబరు 3వ తేదీ నుంచి స్టార్ వరల్డ్, స్టార్ వరల్డ్ ప్రీమియర్ హెచ్ డీలో క్వాంటికో ప్రసారం కానుంది.

  • Loading...

More Telugu News