: మక్కా తొక్కిసలాటలో 35కు పెరిగిన భారతీయుల మృతుల సంఖ్య


ఇటీవల మక్కాలో చోటుచేసుకున్న తొక్కిసలాట సంఘటనలో మరో ఆరుగురు భారతీయులు మృతి చెందారు. ఈ మృతదేహాలను ఈ రోజు సాయంత్రం సౌదీ అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. మృతులను కేరళ (ఐదుగురు), జార్ఖండ్ (ఇద్దరు), గుజరాత్ (నలుగురు), బీహార్ (ఒక్కరు), ఉత్తరప్రదేశ్ (ఒక్కరు)కు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. కాగా, ఈ రోజు ఉదయం ఏడుగురు భారతీయుల మృతదేహాలను సౌదీ అధికారులు గుర్తించిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటి వరకు మక్కా తొక్కిసలాటలో మృతి చెందిన భారతీయుల సంఖ్య 35కు చేరినట్లు సుష్మ తెలిపారు.

  • Loading...

More Telugu News