: గూగుల్ తల్లికి 17వ పుట్టినరోజు
ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్, నెటిజన్లతో విడదీయలేని బంధాన్ని పెనవేసుకున్న గూగుల్ సంస్థ తన 17వ పుట్టినరోజును ఆదివారం జరుపుకుంది. ఈ సందర్భంగా గూగుల్ హోం పేజీలో ప్రత్యేక డూడుల్ పెట్టారు. 1998లో యూఎస్ లోని కాలిఫోర్నియాలో గూగుల్ సంస్థను స్థాపించారు. స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీకి చెందిన అప్పటి విద్యార్థులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్ లు ఈ సంస్థ వ్యవస్థాపకులు. ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ కు సీఈఓగా ప్రస్తుతం భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.