: ఖమ్మం, పశ్చిమగోదావరి జల్లాలలో నిమజ్జనంలో అపశృతులు
ఖమ్మం, పశ్చిమగోదావరి జల్లాల్లో జరిగిన వినాయక నిమజ్జనోత్సవాల్లో అపశృతులు చోటు చేసుకున్నాయి. ఖమ్మం పట్టణంలోని మున్నూరు బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో పాల్గొన్న ఇద్దరు భక్తులు గల్లంతయ్యారు. వీరిని రాజస్థాన్ కు చెందిన గోపాల్, విక్రమ్ లుగా గుర్తించారు. ఇక.. పశ్చిమ గోదావరి జిల్లా విషయానికొస్తే పాలకొల్లు మండలం చింతపర్రు గ్రామంలో మరో అపశృతి చోటుచేసుకుంది. నిమజ్జనోత్సవాల సందర్భంగా చేస్తున్న ప్రదర్శనలో ఒక వ్యక్తి నోట్లో కిరోసిన్ పోసుకుని నిప్పులు వెదజల్లే విన్యాసం చేస్తుండగా అతనికి ఎదురుగా ఉన్న నలుగురు చిన్నపిల్లలకు గాయాలయ్యాయి. గాయపడ్డ పిల్లలను పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.