: కపిలతీర్థం జలపాతంలో ఐదుగురు గల్లంతు
తిరుమలలోని శేషాద్రి కొండకు దిగువన, ఏడుకొండలకు వెళ్లే దారిలో ఉన్న కపిలతీర్థం జలపాతంలో ఐదుగురు భక్తులు గల్లంతయ్యారు. జలపాతం నుంచి ఒక్కసారిగా వచ్చిన వరద కారణంగా ఈ సంఘటన జరిగినట్లు సమాచారం. గల్లంతైన వారిలో నలుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇంకొక వ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు సంబంధిత అధికారులు చెప్పారు. మృతులు ఏ ప్రాంతానికి చెందిన వారనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. తిరుమలలో ఈ రోజు కురిసిన భారీ వర్షం కారణంగా వరద పోటెత్తినట్లు సమాచారం.