: మణిపూర్ గవర్నర్ కన్నుమూత
మణిపూర్ గవర్నర్ సయ్యద్ అహ్మద్(73) ఆదివారం కన్నుమూశారు. ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో ఈ రోజు ఉదయం మృతి చెందినట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న సయ్యద్ అహ్మద్ వారం క్రితం ఈ ఆసుపత్రిలో చేరారు. సయ్యద్ కు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇదిలా ఉండగా, సయ్యద్ మృతిపై కేంద్రమంత్రులు సంతాపం తెలిపారు. కాగా, ఈ ఏడాది మేలో మణిపూర్ గవర్నర్ గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. సయ్యద్ సొంత రాష్ట్రం మహారాష్ట్ర. ముంబయిలోని నాగ్ పడా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున 5 సార్లు ఎమ్మెల్యేగా ఆయన విజయం సాధించారు. యూపీఏ హయాంలో జార్ఖండ్ గవర్నర్ గా సయ్యద్ పనిచేశారు.