: యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన స్నేహితులు


హైదరాబాద్ నగర శివారులోని కుత్బుల్లాపూర్ లో ఉన్న మగ్దూంనగర్ లో ఆనంద్ అనే యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన సంఘటన ఈరోజు జరిగింది. యువకుడి స్నేహితులే ఈ దారుణానికి పాల్పడ్డారు. గతంలో ఫైనాన్స్ విషయమై వారి మధ్య జరిగిన గొడవలే ఇందుకు కారణమని తెలుస్తోంది. యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆనంద్ పరిస్థతి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ దారుణానికి పాల్పడిన నిందితుల్లో ఒకడైన అక్బర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News