: నిమజ్జనానికి 63 అడుగుల విజయవాడ మహా గణపతి
విజయవాడలోని 63 అడుగుల మట్టి గణపతిని నిమజ్జనం చేసేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. చవితి నాటి నుంచీ నిత్య పూజలందుకున్న మట్టి గణపతిని దర్శించేందుకు వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, ఈ రోజు సాయంత్రం 6.30 గంటలకు నిమజ్జన ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. మట్టి గణపతిపై పంపులతో నీళ్లు పోసి నిమజ్జనం చేస్తామని చెప్పారు. ఇదంతా పూర్తవ్వగానే విగ్రహానికి సంబంధించిన మట్టిని భక్తులందరికీ పంచి పెడతామని నిర్వాహకులు చెప్పారు.