: డాలర్ శేషాద్రి ఆరోగ్యం మెరుగు
శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి ఆరోగ్యం మెరుగైంది. ఈ విషయాన్ని వైద్యులు తెలిపారు. శ్వాస కోశసంబంధిత సమస్యతో నిన్న డాలర్ శేషాద్రి అస్వస్థతకు గురయ్యారు. తిరుపతిలో ఉన్న స్విమ్స్ లో ఆయనకు ప్రాథమిక చికిత్స చేశారు. మెరుగైన చికిత్స నిమిత్తం చెన్నైలోని అపోలో ఆసుపత్రికి ఆయనను తరలించచడం జరిగింది. ప్రస్తుతం శేషాద్రికి వైద్య సేవలు కొనసాగుతున్నాయి.