: మందకొడిగా సాగుతున్న నిమజ్జనం, ఇలాగైతే రేపు సాయంత్రం దాకా...!


జంటనగరాల్లో వినాయక విగ్రహాల నిమజ్జనం మందకొడిగా సాగుతోంది. 9:30 కల్లా నిమజ్జనం కోసం బయలుదేరాల్సిన బాలాపూర్ గణపతి 11 గంటల తరువాత కదిలాడు. దీంతో శోభాయాత్ర 2 గంటల ఆలస్యంగా ప్రారంభమైంది. మధ్యాహ్నం రెండు గంటల్లోపే యాత్రను పాతబస్తీ దాటించాలని పోలీసులు భావించినా, ప్రస్తుత పరిస్థితి చూస్తే, సాయంత్రం 6 గంటల సమయంలో ఊరేగింపు ఓల్డ్ సిటీని దాటి అఫ్జల్ గంజ్ వచ్చేలా ఉంది. ఉదయం 8 గంటల వరకూ 2,556 విగ్రహాలు నిమజ్జనం అయ్యాయని, ఆపై ఒంటి గంట వరకూ మరో 2 వేలకు పైగా విగ్రహాలు ట్యాంక్ బండ్ కు చేరాయని తెలుస్తోంది. నిమజ్జనాల నిమిత్తం హైదరాబాద్ శివార్లలోని వివిధ చెరువులు, ట్యాంక్ బండ్ ప్రాంతానికి ఇంకా 16 వేలకు పైగా విగ్రహాలు రావాల్సి వున్నాయి. దీంతో నిమజ్జనం పూర్తి కావడానికి రేపు మధ్యాహ్నం దాటవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News