: మోదీకి రెడ్ కార్పెట్, పోప్ కు తెల్ల కార్పెట్
కాలిఫోర్నియాలోని మినేటా శాన్ జోస్ లో ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన ఘన స్వాగతం లభించిన విషయం తెలిసిందే. 33 ఏళ్ల తర్వాత అక్కడ పర్యటించిన భారత ప్రధానిని ఆహ్వానించేందుకు సిలికాన్ వ్యాలీ ప్రొటోకాల్ అధికారులు ప్రత్యేకంగా తయారు చేయించిన రెడ్ కార్పెట్ పరిచారు. 30 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పుతో ఈ కార్పెట్ ను ప్రత్యేకంగా తయారు చేయించారు. ఇంతకూ ఆ కార్పెట్ ను తయారు చేసింది న్యూజెర్సీకి చెందిన రెడ్ కార్పెట్ స్లోర్స్ డాట్ కామ్. రాగింగ్ బుల్ ఫేమ్ హాలీవుడ్ నటుడు జోయ్ పెస్కి సలహా మేరకు రెడ్ కార్పెట్ తయారీ బాధ్యతను ఈ సంస్థకి అప్పగించామని సిలికాన్ వ్యాలీ ప్రొటోకాల్ చీఫ్ డియాన్నా ట్రయాన్ చెప్పారు. మరో గమ్మత్తేమిటంటే, ఇదే సంస్థ మరో కార్పెట్ ను కూడా తయారు చేసింది. అది తెలుపురంగులో ఉంది. తొలిసారిగా అమెరికాకు వెళ్లిన పోప్ ప్రాన్సిస్ కు ఫిలడెల్ఫియాలో స్వాగతం పలికేందుకు ఈ తెలుపురంగు కార్పెట్ ను ఉపయోగించారట.