: కేరళ అధికారిక వెబ్ సైట్ ను హ్యాక్ చేసి, అశ్లీల ఫోటోలు పెట్టిన పాక్ హ్యాకర్లు
కేరళ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే అధికారిక వెబ్ సైట్ ఈ ఉదయం హ్యాకింగ్ కు గురైంది. పాకిస్థాన్ కు చెందిన కొందరు హ్యాకర్లు ఈ వెబ్ సైట్ లోకి చొరబడి 'పాకిస్థాన్ జిందాబాద్' అని పోస్టులు పెట్టారు. దీంతోపాటు కొన్ని అభ్యంతరకర ఫోటోలను పెట్టారని కేరళ ప్రభుత్వాధికారి ఒకరు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ వెబ్ సైట్ ను బ్లాక్ చేశామని, సాధ్యమైనంత త్వరలో సైటును పునరుద్ధరిస్తామని తెలిపారు. సాధ్యమైనంత త్వరలో వెబ్ సైట్ తిరిగి పనిచేసేలా చూస్తామని వివరించారు.