: తొలిసారి... ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు నాన్ స్టాప్ విమానం!


న్యూఢిల్లీ నుంచి అమెరికా పశ్చిమ తీరంలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరానికి నాన్ స్టాప్ విమాన సర్వీసును నడిపించాలని ఎయిర్ ఇండియా భావిస్తోంది. మొత్తం 16 గంటల పాటు ప్రయాణ సమయం సాగనుండగా, వారానికి మూడు సర్వీసులను బోయింగ్ 777-200 లాంగ్ రేంజ్ విమానాలతో నడిపించాలన్నది ఎయిర్ ఇండియా అభిమతంగా తెలుస్తోంది. ఈ మేరకు ప్రయాణ స్లాట్లను ముందుగానే బుక్ చేసుకున్నామని, డిసెంబరులో సర్వీసులు ప్రారంభమవుతాయని సంస్థ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కాగా, ఇండియా నుంచి అత్యధిక దూరం ప్రయాణించే నాన్ స్టాప్ విమాన సర్వీసుగా ముంబై-నెవార్క్ ఫ్లయిట్ నిలువగా, శాన్ ఫ్రాన్సిస్కోకు సేవలు మొదలైతే, ఆ రికార్డు బద్దలు కానుంది. ఇండియా నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు రోజూ సగటున 600 మంది వరకూ ప్రయాణిస్తారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ విమానంలో మూడు క్లాస్ లుంటాయని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News