: పాత రికార్డు బద్దలు... బాలాపూర్ గణేష్ లడ్డూ ధర ఇదే!


బాలాపూర్ గణేషుడి చేతిలో ఉంచిన లడ్డూ ప్రసాదం వేలం పూర్తయింది. గత సంవత్సరం రికార్డు స్థాయిలో రూ. 9.50 లక్షలకు లడ్డూ అమ్ముడుపోగా, ఈ సంవత్సరం ఆ రికార్డు దాటింది. ఈ ఉదయం జరిగిన వేలంలో కళ్లెం మదన్ మోహన్ రెడ్డి, కోరేటి శ్రీనివాసరెడ్డి, రాంరెడ్డి తదితరులు వేలంలో లడ్డూను దక్కించుకునేందుకు పోటీ పడ్డారు. ఈ లడ్డూ ధర రూ. 10.32 లక్షల పలికింది. కళ్లెం మదన్ మోహన్ రెడ్డి దీన్ని దక్కించుకున్నారు. మరికాసేపట్లో శోభాయాత్ర బాలాపూర్ నుంచి ప్రారంభం కానుంది. లడ్డూ వేలాన్ని తిలకించేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.

  • Loading...

More Telugu News