: నిమజ్జనం ముసుగులో హత్య... నీళ్లల్లో తొక్కి చంపారు!


వేలాది మంది చూస్తుండగా, ఉత్సాహంగా వినాయక విగ్రహాల నిమజ్జనం సాగుతుండగా, ఓ వ్యక్తిని నీళ్లల్లో తొక్కి చంపేసిన ఘటన గుల్బర్గాలో జరిగింది. వివరాల్లోకి వెళితే, ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న మల్లికార్జున్ మృతదేహం గుల్బర్గాలోని ఓ చెరువులో లభ్యమైంది. తొలుత దీన్ని ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనగా పోలీసులు భావించారు. కానీ, వినాయక నిమజ్జనాన్ని ఓ యువకుడు వీడియో తీశాడు. దీనిలో సుమారు నలుగురు వ్యక్తులు మల్లికార్జున్ ను పదేపదే నీటిలో ముంచడం కనిపించింది. కాసేపటికి అతను మరణించడమూ అందులో ఉంది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో ఉంచగా, పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి విచారణ ప్రారంభించారు. హత్యకు గల కారణాలను శోధిస్తున్నట్టు వివరించారు.

  • Loading...

More Telugu News