: 23 వేల విగ్రహాలు, 24 గంటలు...!


పది రోజుల పాటు వివిధ ప్రాంతాల్లోని మండపాల్లో కొలువుదీరిన 23 వేలకు పైగా గణనాధుని విగ్రహాలు నేడు నిమజ్జనం కానున్నాయి. గణేశుని శోభాయాత్ర మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ప్రధాన ఊరేగింపు ఉదయం 11 గంటల లోపు ప్రారంభమై, మధ్యాహ్నం 2 నుంచి 3 మధ్య పాతబస్తీని దాటితేనే నిమజ్జన కార్యక్రమం తెల్లారేసరికి ముగుస్తుందని, లేకుంటే రేపు సాయంత్రం వరకూ సాగుతుందని అధికారులు చెబుతున్నారు. మొత్తం విగ్రహాల్లో సుమారు 10 వేల వరకూ హుసేన్ సాగర్ లో మిగిలినవి శివార్లలోని చెరువుల్లో నిమజ్జనం కానున్నాయి. నిమజ్జనాల కోసం 23 చెరువుల వద్ద క్రేన్లు సిద్ధం చేశామని, మొత్తం 500 సీసీ కెమెరాలతో నిఘా పెట్టామని పోలీసులు తెలిపారు. మహిళల రక్షణ కోసం 150 షీ టీములు పహారా కాస్తున్నాయని వివరించారు. ట్యాంక్ బండ్ పై 21, ఎన్టీఆర్ మార్గ్ లో 10 క్రేన్లను నిలిపామని, వీటి ద్వారా సాధ్యమైనంత త్వరగా నిమజ్జనాలు పూర్తి చేయాలని భావిస్తున్నామని వివరించారు. కాగా, ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకునేందుకు మధ్యాహ్నం ఒంటిగంట వరకు మాత్రమే అనుమతిస్తామని, సాయంత్రం 4 నుంచి 5 గంటలలోపు విగ్రహం ఊరేగింపు ప్రారంభమయ్యేలా చూస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News