: తిరుమలలో క్యూ కట్టిన మంత్రులు, సెలబ్రిటీలు
తిరుమల శ్రీవెంకటేశ్వరుని దర్శించుకునేందుకు ఈ ఉదయం ప్రముఖులు క్యూ కట్టారు. ఆంధ్రప్రదేశ్ మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణ, మాజీ మంత్రి టీజీ వెంకటేష్ తదితరులు తిరుమలకు వచ్చారు. వీరంతా ఉదయం వీఐపీ దర్శన సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ నిబంధనల ప్రకారం అధికారులు స్వాగతం పలుకగా, దర్శనం అనంతరం పూజారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఇదే సమయంలో హీరో సాయిధరమ్ తేజ్, నిర్మాత దిల్ రాజు, దర్శకుడు హరీష్ శంకర్ లు సైతం స్వామి దర్శనం చేసుకున్నారు. వీరిని చూసేందుకు భక్తులు పోటీపడ్డారు.