: టెక్ భవిష్యత్తు ఇండియాదే: సుందర్ పిచాయ్
ప్రపంచ టెక్ భవిష్యత్తు ఇండియాతోనే ముడిపడి ఉందని గూగుల్ చీఫ్ సుందర్ పిచాయ్ వ్యాఖ్యానించారు. టెక్ కంపెనీల ప్రతినిధులతో మోదీ సమావేశం కాగా, పిచాయ్ ప్రసంగిస్తూ, సాంకేతిక దేశాభివృద్ధి ఎంతో అవసరమని గుర్తించిన మోదీ, ఇండియాకు ప్రధానిగా ఉండటం ఆ దేశానికి కలిసొచ్చే అంశమని పేర్కొన్నారు. ప్రపంచంలోని ప్రజలందరి సాధికారత దిశగా పనిచేసేందుకు ఇదే సరైన సమయమని అభిప్రాయపడ్డ ఆయన, టెక్ విభాగంలో కీలక పాత్ర భారత్ దేనని వివరించారు. వినూత్న ఆలోచనలతో వస్తున్న స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించడంలో భారత్ ముందు నిలిచిందని, నూతన ఆవిష్కణలకు ఇండియాను వేదికగా చేయడంలో ప్రధాని ముందున్నారని అన్నారు. డిజిటల్ ఇండియా, మేకిన్ ఇండియా కార్యక్రమాలు ఎంతో గొప్పవని, వీటికి తమవంతు సహకారాన్ని అందిస్తామని తెలిపారు.