: ఎలక్ట్రిక్ కారులో మోదీ షికారు


అమెరికా పర్యటనలో భాగంగా ప్రస్తుతం శాన్ జోస్ లో ఉన్న నరేంద్ర మోడీ 'టెస్లా' కార్ల తయారీ ఫ్యాక్టరీని సందర్శించారు. మోదీకి స్వాగతం పలికిన టెస్లా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఈలాన్ ముస్క్, ఫ్యాక్టరీని, కార్లు తయారవుతున్న విధానాన్ని గురించి వివరించారు. ఈ సందర్భంగా టెస్లా తయారు చేసిన బ్యాటరీ కారులో మోదీ ప్లాంటు అంతటినీ చుట్టొచ్చారు. అనంతరం మోదీ మాట్లాడుతూ, అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తూ, టెస్లా బ్యాటరీ కార్లను తయారు చేస్తున్న తీరు అద్భుతమని ప్రశంసించారు. కాగా, సిలికాన్ వ్యాలీలో పర్యటిస్తున్న తొలి భారత ప్రధానిగా నిలిచిన మోదీ ఫేస్ బుక్, గూగుల్ సహా పలు ఐటీ కంపెనీల ప్రతినిధులతో నేడు సమావేశం కానున్నారు.

  • Loading...

More Telugu News