: నక్లెస్ రోడ్డులో బ్రేకులు పడక లారీ బీభత్సం


గణేష్ నిమజ్జనం ఉత్సాహంగా మొదలైన వేళ చిన్న అపశ్రుతి చోటు చేసుకుంది. ఈ ఉదయం హైదరాబాదు హుసేన్ సాగర్ వద్దకు గణేశుని విగ్రహంతో వచ్చిన ఓ లారీ అదుపు తప్పింది. నిమజ్జనం అనంతరం తిరిగి బయలుదేరిన లారీ బ్రేకులు నక్లెస్ రోడ్డులో పనిచేయలేదు. దీంతో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి లారీని డివైడరుకు ఢీకొట్టించి ఆపాడు. అయినప్పటికీ, 9 మంది యువకులకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన పోలీసులు వీరిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. లారీని పక్కకు తీసి ట్రాఫిక్ ను పునరుద్ధరించారు.

  • Loading...

More Telugu News