: బిజిగిరి షరీఫ్ దర్గాను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం
కరీంనగర్ జిల్లాలోని బిజిగిరి షరీఫ్ దర్గాను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఎంపీ వినోద్ తో కలిసి ఆయన శనివారం దర్గాను సందర్శించారు. ఈ సందర్భంగా దర్గా మత పెద్దలు ఘనస్వాగతం పలికారు. దర్గాలో సమాధులపై చాదర్లను ఉంచి, ప్రార్థనలు చేశారు. అనంతరం మంత్రి ఈటెల మాట్లాడుతూ ఇక్కడ ప్రతి ఏటా జరిగే ఉరుసు ఉత్సవాలకు ముస్లింల కన్నా హిందువులే ఎక్కువగా వస్తుంటారని అన్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం దర్గాలో వసతులు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాత్రి వేళల్లో భక్తులు ఉండేందుకు వీలుగా గదులు నిర్మిస్తామన్నారు.