: ప్రభుత్వం ప్రతిపక్షాలపై సీబీఐని ప్రయోగిస్తోంది: కాంగ్రెస్
ప్రతిపక్షాలపై కేంద్రం సీబీఐని ప్రయోగిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ నివాసంపై సీబీఐ సోదాలు నిర్వహించడంతో కాంగ్రెస్ మండిపడుతోంది. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ ఢిల్లీలో మాట్లాడుతూ, ఎన్డీయే ప్రభుత్వం చేపడుతున్న ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యమా? నియంతృత్వమా? లేక ఎమర్జెన్సీనా? అని ప్రశ్నించారు. వీరి చర్యలపై ప్రజలకు కూడా సరైన అవగాహన లేదని ఆయన అభిప్రాయపడ్డారు. రాత్రి ఎఫ్ఐఆర్ నమోదైతే ఉదయానికల్లా సోదాలు జరగడం విడ్డూరంగా ఉందని ఆయన పేర్కొన్నారు.