: కూలిపోయిన మలేసియా విమానం అవశేషాల గుర్తింపు
గతేడాది ఉక్రెయిన్ లో కూలిపోయిన మలేసియా ఎయిర్ లైన్స్ కు చెందిన ఎంహెచ్ 17 విమానం శకలాలను ఉక్రెయిన్ లో గుర్తించామని నెదర్లాండ్స్ అధికారులు వెల్లడించారు. గతేడాది జూలై 17న నెదర్లాండ్స్ రాజధాని అమ్ స్టర్ డామ్ నుంచి మలేసియా రాజధాని కౌలాలంపూర్ 298 మంది ప్రయాణికులతో బయల్దేరిన ఎంహెచ్ 17 మలేసియా విమానం ఉక్రెయిన్ లోని హర్ బోవ్ ప్రాంతంలో కూలిపోయింది. వీటిని గుర్తించిన స్థానిక అధికారులు నెదర్లాండ్స్ విదేశాంగ శాఖకు సమాచారమందించారు. దీంతో సంఘటనా స్థలికి చేరుకున్న నెదర్లాండ్స్ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.