: చిట్యాల తహశీల్దార్ ఆత్మహత్య
వరంగల్ జిల్లాలోని చిట్యాల మండలం తహశీల్దార్ మచ్చికట్ల శ్రీనివాస్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సమస్యల కారణంగానే ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని తెలుస్తోంది. హన్మకొండలోని ప్రగతినగర్ లో శ్రీనివాస్ నివాసం ఉండేవాడు. గతంలో జరిగిన గ్రూప్స్ పరీక్షల్లో ఎమ్మార్వో ఉద్యోగం సంపాదించిన శ్రీనివాస్ అంతకుముందు పోలీస్ శాఖలో కూడా విధులు నిర్వహించాడు. శ్రీనివాస్ కు భార్య, కుమార్తె ఉన్నారు. కాగా, తనకు కుటుంబసమస్యలు ఉన్నాయని తరచుగా తమతో చెప్పేవాడని శ్రీనివాస్ మిత్రులు అంటున్నారు. ఇటీవలే తన కుమార్తె పుట్టిన రోజును చాలా గ్రాండ్ గా చేశాడని చెప్పారు.